About
స్థిరమైన గ్రామీణ జీవనోపాధిని నడిపించే మా లక్ష్యం, దృష్టి మరియు ప్రధాన విలువలను కనుగొనండి.
మేము ఎవరు.
ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహాసమాఖ్య
Orugallu Mutual Aid Cooperative Maha Samakhya
మహిళా సాధికారత మరియు పేదరిక నిర్మూలనకు అంకితం
మహాసమాఖ్య ఉద్దేశాలు
- సంస్థాగత నిర్మాణం లో ఉన్న అన్ని స్థాయి సంస్థలను అనగా స్వయం సహాయక సంఘాలు, గ్రామైక్య సంఘాలు, మండల సమాఖ్యలకు తగిన సలహా సూచనలు ఇఛ్చి వాటిని పటిష్ట పరుచుటకు కృషి చేస్తుంది
- సభ్య మండల సమాఖ్యలు తమ సభ్య సంఘాలకు మరియు సభ్యులకు పారదర్శకమైన మెరుగైన సేవలను అందించుటకు సహకరిస్తుంది
- సభ్య మండల సమాఖ్యలు తమ తమ జిల్లాలలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఆచరణ పద్ధతులను అమలు చేస్తూ ఇతర సంస్థలకు మార్గదర్శకంగా ఉండేటట్టుగా సలహా సూచనలు అందిస్తుంది
- సభ్య మండల సమాఖ్యలు ఆర్థిక సాధికారతను స్వయం ప్రతిపత్తిని సాధించుటకు వాటికి నిరంతరం పలు రకాల సేవలను అందిస్తుంది
- సభ్య మండల సమాఖ్యల యొక్క సభ్యులకు కేడర్లకు, సిబ్బందికి అవసరమైన అన్ని రకాల నైపుణ్యాభివృద్ధి శిక్షణలను అందించి సంస్థల యొక్క సుస్థిరతకు దోహదం చేస్తుంది
- సభ్య మండల సమాఖ్యల పరిధిలో అవసరమైనటువంటి కొత్త కార్యక్రమాలను చేపట్టి సమర్థవంతంగా నిర్వహించి వాటిని ఇతర ప్రాంతాలలో అమలు పరుచుటకు కావలసినటువంటి స్ఫూర్తిని అందించడం జరుగుతుంది
- ఇతర జిల్లాలలో, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న సంస్థలకు మరియు జాతీయ అంతర్జాతీయ స్థాయి నుండి విచ్ఛేసేటువంటి పలుగురు ప్రతినిధులకు ఉత్తమ ఆచరణ పద్దతులపై అవగాహనా కార్యక్రమాలు క్షేత్రస్థాయి సందర్శనలు ఏర్పాటు చేస్తుంది
OMS అభివృద్ధి పరిచిన సామజిక వనరులు
అంతర్గత CRPలు
సంఘాలలో చురుకుగా ఉన్న మహిళలను ఎంపిక చేసి వారికి వివిధ రకాల శిక్షణల ఇప్పించి అంతర్గత CRPలుగా తయారుచేసి సభ్య మండలాల లోని సంఘాలు, ఇతర జిల్లాలలో కూడా శిక్షణలు ఇస్తూ సంఘాల పటిష్టతకు కృషి చేస్తున్నది.
హిందీ CRPలు
సంఘాలలో చురుకుగా ఉన్న మహిళలను, బుక్ కీపర్లను ఎంపిక చేసి వారికి హిందీ భాష మరియు సంఘాల నిర్వహణ పైన 100 రోజులు శిక్షణ ఇప్పించి CRPలుగా తయారుచేసి ఇతర రాష్ట్రాలలోని సంఘాల తయారీ, పటిష్టత మరియు ఆడిట్ పైన శిక్షణలు ఇప్పించడం జరిగింది.
Sr.CRPలు
గ్రామ/మండల స్థాయిలో పనిచేసి చురుకుగా ఉన్న మహిళలను ఎంపిక చేసి వారికి కూడా హిందీ భాష మరియు గ్రామ/మండల సమాఖ్యల నిర్వహణ పైన 100 రోజులు శిక్షణ ఇప్పించి Sr.CRPలుగా తయారుచేసి ఇతర రాష్ట్రాలలోని గ్రామ/మండల సమాఖ్యల తయారీ, పటిష్టత మరియు ఆడిట్ పైన శిక్షణలు ఇప్పించడం జరిగింది.
SLCT లు
CRP, Sr.CRP, BKలు గా ఇతర రాష్ట్రాలలో పని చేసిన వారిని ఎంపిక చేసి వారి ద్వారా ఇతర రాష్ట్రాలలోని గ్రామ/మండల సమాఖ్యల తయారీ, పటిష్టత మరియు ఆడిట్ పైన ఆయా రాష్ట్రాల బుక్ కీపర్లకు, సిబ్బందికి ToT శిక్షణలు ఇప్పించడం జరిగింది.
PRPలు
CRP, Sr.CRP, BKలు గా ఇతర రాష్ట్రాలలో పని చేసిన వారిని ఎంపిక చేసి వారి ద్వారా OMS మరియు ఇతర రాష్ట్రాలకు జరిగిన MoU ప్రకారం ఆయా రాష్ట్రాలలో PRPలు సంఘాల ఏర్పాటు పైన పని చేయడం జరిగింది.
eMTలు
CRP, Sr.CRP, BKలు గా ఇతర రాష్ట్రాలలో పని చేసిన వారిని ఎంపిక చేసి వారికి LokOS పైన SHG, VO ప్రొఫైల్, transaction ఎంట్రి శిక్షణలు ఇప్పించి ఇతర రాష్ట్రాలలోని సంఘాల వారికి SHG, VO ప్రొఫైల్, transaction ఎంట్రి శిక్షణ ఇప్పించడం జరిగింది.
మహిళా శక్తి క్యాంటీన్
ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహా సమాఖ్య ద్వారా వరంగల్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది.
OMS భవన నిర్మాణం
OMS భవనానికై కేటాయించిన 18 గుంటల స్థలంలో TSSA, వరంగల్ వారి ద్వారా CEO-SERP గారు మంజూరీ చేసిన 60 లక్షల నిధులతో నిర్మాణం ప్రారంభమైంది. స్లాబ్ వరకు పని అయినది.
OMS అందిస్తున్న సేవలు
- సంఘాల ఆడిట్: SERP సహకారంతో అనుభవం కలిగిన సంఘాల బుక్ కీపర్లను గుర్తించి శిక్షణ ఇచ్చి 2016 సంవత్సరం వరకు సభ్య మండలాలలో 2,503 సంఘాలు ఆడిట్ చేయడం జరిగింది.
- సామాజిక వనరుల (CRP) ల అభివృద్ధి: OMS ద్వారా చిన్న సంఘాల సభ్యులు, బుక్ కీపర్ల నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన శిక్షణలు అందించి వారిని CRPలు, Sr.CRPలు, SLCTలు, కమ్యూనిటీ ఆడిటర్లు, eMTలు గా తీర్చిదిద్ది సేవలు అందిస్తున్నది.
- సామర్ధ్యాల పెంపుదల: అవసరాన్ని బట్టి CRP లకు రిఫ్రెషర్ శిక్షణలు ఇప్పించి వారి శిక్షణా నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది.
- ఆర్థిక అక్షరాస్యత SRPలు: తెలంగాణ రాష్ట్రంలోని 13 జిల్లాలలో 39 మంది మాజీ OB సభ్యులను ఎంపిక చేసి వారికి ఆర్థిక అక్షరాస్యత పైన TGIRD లో 4 రోజులు శిక్షణ అందించడం జరిగింది.
- క్షేత్ర సందర్శనలు/అధ్యయన పర్యటనలు: ఇతర రాష్ట్రాలలోని సంఘాల సభ్యులు, బుక్ కీపర్లు, బ్యాంకర్లు మరియు ఇతర దేశాల ప్రతినిధులకు కూడా OMS ద్వారా క్షేత్రస్థాయి పర్యటనలు, శిక్షణలు నిర్వహించడం జరుగుతుంది.
- సాంకేతిక సేవలు: 120 మందిని ఎంపిక చేసి వారికి LokOS పైన SHG, VO, MS ల ప్రొఫైల్, transaction ఎంట్రి శిక్షణలు ఇప్పించి ఇతర రాష్ట్రాలలోని సంఘాలకు సేవలు అందిస్తున్నది.
ఓరుగల్లు మహా సమాఖ్య భవిషత్ ప్రణాళిక 2024-25
- సభ్య మండల సమాఖ్యల పరిధి లో సంఘాల లో చేరకుండా ఉన్న నిరుపేద, పేద మహిళల ను 100% సంఘాలలో చేర్పించుటకు ప్రోత్సహించుట
- అన్ని మండల సమాఖ్యల పరిధి లో ఉన్న దివ్యాంగుల గుర్తింపు మరియు వారిని ప్రత్యేక సంఘాల గా ఏర్పాటు చేయుటకు సహకరించుట
- సమాఖ్య పరిధి లోని అన్ని సంఘాలు, సంస్థలు 100% పంచ సూత్రాలు పాటించునట్లు చూడటం
- సభ్య మండల సమాఖ్యల పరిధి లోని గ్రామ, మండల సమాఖ్యల స్థాయి లో ఏర్పడిన సబ్ కమిటీల పటిష్టతకు కావాల్సిన సామర్ధ్యాల పెంపుదల చేపట్టుట
- సమాఖ్య పరిధి లో ఒక నైబర్ హుడ్ సెంటర్ ను ఏర్పాటు చేయుట
- సమాఖ్య పరిధి లోని మండలాలలో సంఘాల, గ్రామ సంఘాల మరియు మండల సమాఖ్యల వివరాలను లోకోస్ ఆప్ లో 100% నమోదు చేయుటకు సహకరించుట
- మహా సమాఖ్య స్వంతం గా ఒక "శిక్షణ కేంద్రం" ఏర్పాటు చేసుకునుట
- సమాఖ్య పరిధి లోని మండలాల లో 110 మంది మహిళా బుక్ కీపర్ లను లోకోస్ మాస్టర్ ట్రేనర్ లు గా అభివృద్ధి చేయుట
- మహా సమాఖ్య స్వంత web సైట్ ను ఏర్పాటు చేసుకునుట
- సభ్యుల, సంస్థల, కేడర్ ల అవగాహన పెంపుదల కు 10 వీడియో లు రూపొందించుట (షార్ట్ ఫిలిం)
- సంస్థ పరిధి లోని ఉత్తమ ఆచరణ పద్దతులను ప్రోత్సహించుటకు ఆరోగ్యకరమైన పోటీని ఏర్పాటుచేయుటకు వివిధ రకాల అవార్డ్ లు అందించుట
- సంస్థ పరిధి లోని మండల సమాఖ్యల సహకారం తో 2 ప్రత్యేక మహిళా ఆరోగ్య శిభిరాలు నిర్వహించుట
- SERP ద్వారా జరిగే శిక్షణలకు క్షేత్ర సందర్శనలు ఏర్పాటు, సి.ఆర్.పి లను పంపించుట
- సభ్య మండల సమాఖ్యల పాలక వర్గం, కార్యవర్గం, సిబ్బంది కి అవసరమగు శిక్షణ లకు తోడ్పాటు
మా విజన్ & మిషన్
విజన్
మహిళా సాధికారత మరియు పేదరిక నిర్మూలన ద్వారా సమాజంలో సుస్థిర అభివృద్ధిని సాధించడం
మిషన్
స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేసి, వారి సామర్థ్యాలను పెంపొందించి, ఆర్థిక స్వావలంబనను సాధించేలా మార్গదర్శకత్వం అందించడం
మా విజయాలు
సంప్రదింపుల కోసం
ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహాసమాఖ్య
వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
మహిళా శక్తి ద్వారా సమాజ మార్పు
మా లక్ష్యం
తెలంగాణలోని ప్రతి సహకార సభ్యునికి పారదర్శక, సమర్థవంతమైన మరియు అందుబాటులో ఉండే సేవలను అందించడం, స్థిరమైన సాంస్థిక వేదికల ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు పేదరికాన్ని తగ్గించడం.
ప్రధాన విలువలు.
ఐక్యత
మేము పరస్పర సహాయం, సామూహిక చర్చ మరియు కమ్యూనిటీ సాధికారత కోసం కలిసి నిలబడటంలో నమ్మకం ఉంచుతాము.
దూరదృష్టితో కూడిన వృద్ధి
గ్రామీణ యువత మరియు మహిళల కోసం స్థిరమైన వ్యవసాయ పద్ధతులు, సూక్ష్మ-పరిశ్రమలు మరియు నైపుణ్య శిక్షణను ప్రోత్సహించడం.
సుస్థిరత
దీర్ఘకాలంలో స్వతంత్రంగా పనిచేసే ఆర్థికంగా లాభదాయకమైన, స్వయంపాలిత స్థానిక సంస్థలను నిర్మించడం.
తరచుగా అడిగే ప్రశ్నలు.
OMS గురించి సాధారణ ప్రశ్నలకు త్వరిత సమాధానాలు
సహాయం కావాలా?.
మా మద్దతు మరియు ఫీల్డ్ సహాయ బృందం సహకార సేవలను నావిగేట్ చేయడంలో మీకు సహాయం చేయడానికి అందుబాటులో ఉంది.
📞 మద్దతుకు కాల్ చేయండి: 040-23298568 ✉️ సందేశం పంపండి