040-23298568 omswarangal4@gmail.com
Reg No: AMC/WGL/DCO/2011/3332  |  Est: 08/03/2011

U Shoba

విజయ కథ

U Shoba
09 June 2026
బాల్యం
మాది సాంబయ్య పల్లె అనే చిన్న పల్లెటూరు, ఆ గ్రామంలో మా అమ్మ, నాన్న, తాత, నానమ్మ, ఒక తమ్ముడు, చెల్లి నేను మాది పెద్ద కుటుంబం మా అమ్మ నాన్న వ్యవసాయం చేసే వాళ్ళు పంటలు పండక చిన్న కిరాణం దుకాణం నడుపుతూ మా అవసరాలు తీర్చుకునేవాళ్లం ఆర్థికంగా అప్పు కావడంతో కొంత భూమిని అమ్మి అప్పు తీర్చడం జరిగింది మా నాన్నగారి అనారోగ్యం కారణంగా చాలా డబ్బు ఖర్చు కావడం జరిగింది ఆ సమయంలో మా తాతగారు అనారోగ్యంతో చనిపోయారు అప్పులు ఎక్కువ కావడంతో ఉన్న భూమి అంతా అమ్మి ఆ గ్రామం నుండి గూడూరు అనే గ్రామానికి వలస రావడం జరిగింది ఆ సమయంలో మమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి చదివించారు ఆ సమయంలో మా కుటుంబ అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితి అక్కడ కూడా చిన్న కిరాణం దుకాణం పెట్టి నడుపుకుంటూ మా అమ్మ కూలి పని చేస్తూ మా కుటుంబాన్ని నడిపేవారు ఇలా కొన్ని రోజులు సంతోషం, కొన్ని రోజులు కష్టాలుగా గడిచాయి
చదువు
నేను 9వ తరగతి చదువుతుండగానే పెళ్లి చేశారు 10 వరకు చదువుకున్నాను పిల్లలు పుట్టాక కాకతీయ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ చేశాను CRP పనిచేస్తూ MA RD పూర్తి చేశాను చదువుకోవాలని ఆసక్తి నాకు చాలా ఉండేది అందుకే నేను పెళ్లి అయ్యాక కూడా చదువుకున్నాను
వివాహం
నాకు 14 సంవత్సరాల వయసులో పెళ్లి చేశారు పెళ్లికి కారణం మా కుటుంబ పరిస్తితి, నిరుపేద కుటుంబంలోకి ఇచ్చి పెళ్లి చేశారు నాది బాల్య వివాహం తెలిసి తెలియని వయసులో చాలా కష్టాలు పడ్డాను
పిల్లలు
మాకు ఇద్దరు పిల్లలు పెద్ద బాబు జాబ్ చేస్తున్నాడు, చిన్న బాబు B.Tech 2nd year, చదువుతున్నాడు
సంఘంలో చేరకముందు కుటుంబ పరిస్థితి
నాకు చాలా చిన్నతనంలో వివాహం జరిగింది నా భర్తకు ఫర్టిలైజర్ షాపు లో నష్టం రావడం వలన అప్పుల బాధలు ఎక్కువగా కావడం వలన ఉన్న ఒక ఎకరం భూమి అమ్ముకున్న అప్పులు తీరని పరిస్థితి అత్త మామ నా భర్త ముగ్గురు కూలి పని చేసే వాళ్ళు నన్ను పదవ తరగతి చదివించారు ఆ తరువాత మా గ్రామంలో నుండి వరంగల్ గీసుగొండ మండలంలో జాన్పాక గ్రామానికి వలస రావడం జరిగింది మేము కూలి పని చేసి జీవనం సాగించేది, కిరాయి ఇంట్లో ఉంటున్న సమయంలో నాకు ఒక బాబు పుట్టాడు, అతనిని ఆరోగ్యం బాగాలేదు నా భర్త 1200 రూపాయలకు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవాడు మా మామయ్య అనారోగ్యంతో ఉండేవాడు మా అత్త కూలి పని చేసేది నా భర్త అత్త ఇద్దరి సంపాదనతో కుటుంబం గడిచేది మా అవసరాలు తీరేవి కావు మమ్మల్ని నమ్మి ఎవరు అప్పు ఇచ్చేవారు కాదు చిన్న చిన్న అవసరాలకు కూడా ఇబ్బందులు పడేవాళ్ళం ఆ సమయంలో నేను కూడా పనికి పోలేని పరిస్థితి అప్పుఇచ్చిన వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే వాళ్ళు బంధువుల ఇండ్లలో కూడా మమ్మల్ని చిన్నచూపు చూసేవారు కొన్ని కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళం కాదు

సంఘంలో ఎవరి ప్రోత్సాహంతో చేరారు
మా అమ్మ నా పెళ్లి సంఘము నుండి అప్పు తీసుకొని చేశారు కాబట్టి ఆ పరిస్థితి నాకు గుర్తుంది నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఏమైనా చేయాలని సంఘంలో చేరాను మేము ఉంటున్న గ్రామంలో అప్పటికే 17 సంఘాలు నడుస్తున్నాయి వాటిని చూసి మేము కూడా సంఘం చేసుకోవాలని అనుకున్నాము నేను కొంతమంది ముస్లిం మహిళలను కలుసుకున్నాను మా పక్కన సఫియా అనే మహిళ నాకు సంఘం ఏర్పాటుకు సహాయపడింది
కార్యకర్తగా అవకాశాలు
 2003లో రెండు మండలాలలో జిల్లా సమాఖ్యలో మాసపత్రిక రిపోర్టర్ గా పనిచేశాను
 సంఘంలో బుక్ కీపర్ గా అవకాశం వచ్చింది
 VOA గా అవకాశం వచ్చింది
 లోకల్ మండలాలలో జిల్లాలలో CRP గా Sr.CRP గా పనిచేశాను
 ఆడిటర్ గా పనిచేశాను
 ట్రాన్స్లేటర్ గా అవకాశం వచ్చింది
 SLCT గా SERP ద్వారా అవకాశం వచ్చింది
 NIRD ద్వారా NCRP, NCMT గా అవకాశం వచ్చింది
 SHG ఆడిటర్, VO ఆడిటర్, CLF ఆడిటర్ గా అవకాశం వచ్చింది
 GPDP లో ట్రైనింగ్ అవకాశం వచ్చింది
పొందిన శిక్షణలు
 10 రోజులు TTDCలో
 7 రోజులు BKగా గీసుగొండ లో
 15 రోజులు CRPగా గీసుగొండ లో
 20 రోజులు MCP శిక్షణ
 20 రోజులు ఆడిటర్ గాOMS లో
 50 రోజులు హిందీ CRP, BK గా
 15 రోజులు SLCTగా
 15 రోజులు VO, CLF ఆడిటర్ గా
 10 రోజులు సీనియర్ సిఆర్పి
 10 రోజుల జెండర్ శిక్షణ
 20 రోజులు NCMT శిక్షణ NIRD లో
ఈ విధంగా భారతదేశం లోని 18 రాష్ట్రాలలో CRP గా, Sr.CRP గా, MCP ట్రైనర్ గా, TOT ట్రైనర్ గా, SHG ఆడిటర్ గా, VO ఆడిటర్ గా, CLF ఆడిటర్ గా సంఘాల బలోపేతానికి పని చేయడం జరిగింది

SERP & NIRD-PR ద్వారా
19 రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలలో ఇచ్చినటువంటి శిక్షణలు
1. 2007-08 లో ఆంధ్రప్రదేశ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 జిల్లాలలోని 9 గ్రామాలలో VO OB, EC సభ్యులు 100 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది
2. 2007-09 లో తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని 7 జిల్లాలలో VO ఆడిట్, VO OB, EC సభ్యులు 300 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది మరియు 2018 లో GPDP శిక్షణ 1 జిల్లాలోని 3 మండలాలలో ౧౬౦ మందికి ఇవ్వడం జరిగింది
3. 2007-08 లో బీహార్: బీహార్ రాష్ట్రంలోని CRP గా 5 జిల్లాలలో 50 సంఘాలకు, 8 VO లకు, BK లు 38 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది
4. 2008 లో మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 3 జిల్లాలలోని CRP గా 3 VO లు 90 రోజులు 6 గ్రామాలు, 72 సంఘాలు 30 మంది BK లకు శిక్షణ ఇవ్వడం జరిగింది మరియు NCMT గా అర్బన్ లో, 3 రౌండ్లు 100 కు పైగా ఆదర్శ మహిళలకు BK లకు VO OB లకు, EC సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగంది
5. 2018-19 ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ NCMT ద్వారా 3 రౌండ్లు CRP గా 90 మందికి, 1 రౌండ్ Sr.CRP గా 60 మందికి, 1 రౌండ్ MCP శిక్షణ 50 మందికి ఇవ్వడం జరిగింది
6. 2008 ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ లోని 3 జిల్లాలలోని 6 గ్రామాలలో 54 సంఘాలు, 18 మందికి BK లకు శిక్షణ ఇవ్వడం జరిగింది
7. 2012-2019 ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ లో 160 రోజులు 450 మందికి MCP శిక్షణ, VO బుక్ కీపింగ్, CLF బుక్ కీపింగ్, 80 మంది ICRP లకు శిక్షణ ఇవ్వడం జరిగింది
8. 2014-16 జార్ఖండ్: జార్ఖండ్ 70 రోజులు, 4 రౌండ్లు 220 మంది ఆదర్శ మహిళలకు, బుక్ కీపర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది
9. 2018 హిమాచల్ ప్రదేశ్: హిమాచల్ ప్రదేశ్ లో 15 రోజులు, 66 మంది బుక్ కీపర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది
10. 2015 గుజరాత్: గుజరాత్ లో 18 రోజులు, 3 బ్యాచ్ లకు 98 మంది సిబ్బందికి MCP, VO ల పై శిక్షణ ఇవ్వడం జరిగింది
11. 2015 ఒరిస్సా: ఒరిస్సా లో 82 రోజులు, 6 బ్యాచ్ లకు 240 మంది CRP లకు VO పైన శిక్షణ ఇవ్వడం జరిగింది
12. 2018 పశ్చిమ బెంగాల్: పశ్చిమ బెంగాల్ లో 7 మండలాలలో 45 రోజులు 205 మంది కి CLF, VO , బైలా రిజిస్టేషన్ పైన శిక్షణ ఇవ్వడం జరిగింది
13. 2012-2020 మహారాష్ట్ర: 52 మంది BK లు, 233 మంది ఆదర్శ మహిళలు, 60 మంది MCP ట్రైనర్స్, 180 మంది VO బుక్ కీపర్లు, 92మంది CLF బుక్ కీపర్లు, 200 మంది SHG,VO, CLF ఆడిటర్లకు శిక్షణ ఇవ్వడం జరిగింది
14. 2018-2021 అండమాన్: 15 రోజులు MCP పైన 45 మందికి, 240 మంది VO సభ్యులకు, 72 మంది MS సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగింది
15. 2018 హర్యానా: 1 రౌండ్, 50 మందికి IB CB, నాయకత్వం మార్పిడి పైన శిక్షణ ఇవ్వడం జరిగింది
16. 2016-2018 పంజాబ్: 2 రౌండ్లు 40 రోజులు 200 మంది CLF సభ్యులకు, 60 మంది OB EC సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరిగింది
17. 2011 అస్సాం: 1 రౌండ్, 46 మంది సిబ్బందికి MCP శిక్షణ ఇవ్వడం జరిగింది
18. 2019 జమ్మూ కాశ్మీర్: 1 రౌండ్ సిబ్బంది కి బుక్ కీపింగ్ శిక్షణ ఇవ్వడం జరిగింది
19. 2009 రాజస్థాన్: 1 రౌండ్ 2 గ్రామాలలో 24 సంఘాలకు శిక్షణ ఇవ్వడం జరిగింది
20. 2009-2021 NIRD(OMS): 29 రాష్ట్రాలలోని కమ్యూనిటి స్థాయి, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి సిబ్బందికి మరియు గ్రామాల సందర్షన కు వచ్చిన సందర్శకులకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, 800 లకు పైగా శిక్షణలు ఇవ్వడం జరిగింది. CRP, OB, CC, APM, DPM, SPM లకు శిక్షణ ఇవ్వడం జరిగింది మరియు 5000 మందికి పైగా సందర్శకులకు ట్రాన్స్లేటర్ ట్రైనర్ గా పని చేయడం జరిగింది
శిక్షణ ద్వారా నేను తెలుసుకున్నది
 ఇతర రాష్ట్రాలలో మహిళలలో చాలా మార్పు రావడం జరిగింది.
 బయటికి రానివారు ఇప్పుడు చైతన్యవంతంగా జీవనోపాదుల ఏర్పాటు చేసుకొని ఆదాయ అభివృద్ధి చేసుకుంటున్నారు
 ముఖ్యంగా శుభ్రత మరుగుదొడ్లు కట్టుకోవడం వాడటం తెలిసింది పిల్లలను శుభ్రంగా ఉంచడం, సమాన స్థాయిలో చదువులు చదివించడం
 ఒక్క రూపాయికి బాధపడేవారు సంఘం అండగా అప్పు తీసుకోగలుగుతున్నారు.
 చిన్న చిన్న వ్యాపారాలు కుటీర పరిశ్రమలు చేనేత వస్తువుల తయారీ
 నాన్ పోస్ట్ పెయిడ్ పంటలు పండించుకోవడం
 ఆరోగ్య విషయాలు పరిశుభ్రత గురించి పౌష్టికాహారం గురించి అవగాహన
 సంస్థలను సుస్థిరంగా చేసుకుని సుస్థిర జీవనోపాదులను సంపాదించుకోవడం
 పెన్ను వదిలేసిన వాళ్ళు పెన్నుబట్టి బుక్ కీపర్ శిక్షణ ఆడిటర్ శిక్షణ తీసుకోవడం
 బ్యాంకుకు వెళ్లి రుణాలు పొందడం, ఆర్థిక అభివృద్ధి చదువులకు ఖర్చు పెట్టడం
 గ్రామసభల గురించి తెలుసుకోవడం గ్రామసభలకు హాజరు కావడం
 కూరగాయలు, పండ్లు పండించి వ్యాపారం చేయడం
 సంస్థలను కాపాడుకోవడం
 వ్యక్తిగతంగా మార్పు మాట్లాడే ధైర్యం
 సంస్థలపైన నమ్మకం
నాకు వచ్చిన అవకాశాలు
• 2008 లో ముఖ్యమంత్రి YS. రాజశేకర్ రెడ్డి గారి మీటింగ్ లో మాట్లాడే అవకాశం
• 2009 లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి మీటింగ్ లో మాట్లాడే అవకాశం
• 2009 లో ఆగలె సంగ్మ తో రంగారెడ్డిలో మాట్లాడే అవకాశం
• 2010 లో కేంద్ర మినిస్టర్ గారి మీటింగ్ o పాల్గొనడం
• 2012 లో 180 మంది IAS అధికారులకు జరిగే శిక్షణలో మాట్లాడే అవకాశం
• 2014 లో NIRD లో గోయల్ సార్ ని కలిసి, సార్ సమక్షంలో మాట్లాడే అవకాశం
• 18-04-2023 లో డిల్లీ లో సంగటన్ కే సమూహ్ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం
• 15-06-2023 - 16-06-2023 లో తమిళనాడులో జరిగిన G20 లో భాగంగా W20 లో పాల్గొనే అవకాశం
• ఇంకా చిన్న చిన్న అవకాశాలను నా సంఘం మరియు OMS ల ద్వారా పొందగలిగాను
• NIRD & OMS, SERP ద్వారా 29 రాష్ట్రాల వారి సందర్శనలో సంఘ స్థాయి MS స్థాయి, జిల్లా స్థాయి లో ట్రాన్స్లేటర్ గా పని చేశాను, గ్రామ సందర్శన చేయించాను, 1000 కి పైగా శిక్షణలు ఇవ్వడం జరిగింది, CRP, OB, CC, APM, DPM, SPM లకు IAS లకు శిక్షణ ఇచ్చాను మరియు ట్రాన్స్లేటర్ గా పనిచేశాను 5000 కి పైగా మందికి ట్రాన్స్లేటర్ గా పనిచేశాను

యు.శోభారాణి
గామము జాన్ పాక, మం॥ గీనుగొండ
సంఘములో చేరకముందు
నా పేరు ఉప్పునూతల శోభారాణి, మాది మధ్య తరగతి కుటుంబము మా తాతయ్యకు మా నాన్న ఒక్కడే కొడుకు మేము ఇద్దరము అక్క చెల్లెళ్లము మాకు ఒక తమ్ముడు మాది చాలా పల్లెటూరు 30 ఎకరాల ఆస్తి 4 గురు జీతగాళ్లు మా నాన్న పళ్లతోటల వ్యాపారము చేసేవాడు అప్పటికి నా వయస్సు 9 యేళ్లు మా నాన్నకు ఇంత ఆస్తి ఉండటము మా ఊరిలోని వాళ్లకు మా పాలివాళ్లకు ఇష్టము లేదు మా నాన్నను మా తాతను ఎప్పుడు చంపి ఆస్తి కాజేయాలనే దురుద్ధేశ్యముతో ఉండేవారు ఒక రోజు లేని పోని మాటలు నక్సలైట్లకు చెప్పటముతో వారు కూడా మా నాన్నను చంపాలని వచ్చారు మేము అతి చిన్న వయస్సులోనే వారి కాళ్లపై పడి మా నాన్నను చంపవద్దని మా కుటుంబ సభ్యులంత వారికి జరిగిందంతా వివరించారు దాంతో వాళ్లు కూడా అప్పటినుండి జరిగిందంతా వివరించి దైర్యము చెప్పి వెళ్లారు మా నాన్న కు ఆరోగ్యము క్షీణించడముతో జీతగాళ్లు పల్ల వ్యాపారము లాస్ చేయడముతో మా తాతయ్యకు చాలా భాద వేసింది ఒక రోజు మా నాన్న రోడ్డు మీద నుండి వస్తుండగా అమ్మ నాన్న లేని సమయములో తాతయ్యకు మంచిగా కళ్లు తాగించి రాయి మరియు కర్రలతో కొట్టాలని చూస్తే మానాన్న అడ్డుకున్నప్పుడు రోడ్డు మీద దొర్లుతు పడిపోయాడు రక్తము కారింది ఆ సమయములో చిన్నదాన్నైన నేను గట్టిగా కేకలు వేయటముతో పాటు మా అమ్మమ్మను అమ్మను పిలుచుకు వచ్చాను. తాతయ్య ఆ ఊరులో ఉండటము ఇష్టము లేక ఉన్న ఆస్థులను అమ్మి గూడురు గ్రామానికి వచ్చి బ్రతకడము కోసము చిన్న కిరాణము ఫాపు పెట్టుకున్నాము అప్పుడు నేను 6వ తరగతి చదువుతున్నాను అప్పటికి ఆ గ్రామములో మా మేనత్త సి.ఎ గా పని చేస్తోంది. మా అమ్మను నాన్నను సంఘములో చేర్పించింది. అప్పుడు మాతాతయ్య కొన్ని రోజుల తర్వాత భూమి అమ్మగా మిగిలిన డబ్బులతో ఒక ఇల్లు కొన్నాడు. దాంట్లో మేము నివాసము ఉండేవాళ్లము. కొన్ని రోజుల తర్వాత తాత అనారోగ్యము కారణముగా సంఘము నుండి అప్పు తీసుకుని హాస్పిటల్లో చేర్చారు తాతయ్య కొన్ని రోజుల తరువాత చనిపోయాడు ఇలా ఐదు సం॥రాలు గడిచింది నేను 9వ తరగతి చదువుతుండగ రోడ్డు వెడెల్పు చేయటములో ఉ్నన ఇల్లు కూడా పోతుందని అన్నారు. నాన్న అనారోగ్యము పాడవడముతో ఆడపిల్లలు ఇద్దరికి పెళ్లి చేయాలని నన్ను ఒక నిరుపేద కుటుంబంలోని వారికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిర్ణయించుకున్నారు అప్పటి పేదరికము వల్ల సంఘములో ఒక లక్ష అప్పు తీసుకుని రూ.60,000/- లు సంఘ సభ్యుల అనుమతితో నాకు కట్నము ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు కిరాణం ఫాపును ఇంకొంచము వృద్ది చేసి అప్పు తీర్చాను. అత్తగారింట్లో వారిని 10వ తరగతి చదువుకుంటానని ఒప్పించడముతో పదవ తరగతి పూర్తి చేశాను. అప్పటికే బ్రతకడం కష్టముగా ఉన్న నాభర్త వరంగల్ జాన్పాక అనే గ్రామానికి వలస వచ్చాడు. జాన్ పాకలో మందుగా గ్రూపు పుస్తకాలు వ్రాస్తు బీడీల పని చేసేదాన్ని దాంతో వాటిలో కూడా నేను ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఎందుకంటే సంఘము డబ్బులతోనే నా పెళ్లి చేశారు అందుకు సంఘములో చేరడము సంఘము ద్వారా ఇంకొంచము వృద్ధి చెంది అప్పు తీర్చాను సంఘములో చేరడము సంఘము ద్వారా ఆర్థిక పరిస్థితిలను చక్కదిద్దుకోవడము చిన్నతనములోనే చూసాను కాబట్టి నేను కూడా సంఘములో చేరాలని నాకు ఆలోచన వ చ్చి సంఘము ఏర్పాటులో పాల్గొన్నాను 2004లో రాణి యస్.హెచ్.జి ఏర్పడింది నాకు అప్పటికే ఒక బాబు అతనికి ఆరోగ్యము బాగాలేకపోవటము మేము వచ్చి 2సం॥రాలే కావడముతో ఆ ఊరిలో ఎవరు పరిచయము లేకపోవడముతో అప్పు ఎక్కడ పుట్టకపోవడముతో సంఘములోనే రూ.5.000/-లు మొదటిసారిగ అప్పు తీసుకుని నాబాబుకు ఆపరేషన్ చేయించాను అలా నా భర్త అత్త మామలు నేను కష్టపడుతు కూలి నాలి చేసి అప్పు తీర్చాము నాకు చిన్న అప్పటి నుండి పై చదువులు చదువాలని కోరిక అందుకు యస్.డి.యల్.సి. ద్వారా డిగ్రీ పూర్తి చేయాలనుకున్నాను ఇంట్లో ఉండి సంఘము ద్వారా రూ.2వేలు తీసుకుని ఫీజు కట్టి బీడీలు చేసి అప్పు తీర్చుకునేదాన్ని అదికూడా భర్తకు అత్తమామలకు తెలియకుండా చదువు కున్నాను దాంతో పాటు చీర్లకు పాతలుపోసి ఆమ్మెదాన్ని. ఇలా రెండవ సంII పూర్తి చేసిన తర్వాత మళ్లీ సంఘము నుండి 3వ సం॥రానికి లోను తీసుకుని చదివాను ఇంకో బాబు పుట్టడంతో మంచి చదువలు చదివిపించాలని నా కోరిక అందుకు అత్తగారు ఒప్పుకోకపోవడముతో నేను ఎవ్వరి మాట వినకుండా నా బాబును స్కూల్లో చేర్పించాను నేను ఒక స్కూల్లో టీచర్ గా పనిచేస్తు స్కూల్ ఫీజులు కట్టుకున్నాను తరువాత ఇల్లు స్థలము కొనుక్కోవాలని గ్రూపులో ఒక లక్ష లోను రావడము తో రూ.50,000/-లు తీసుకుని స్థలము కొనుక్కున్నాను. దాంతో కష్టపడి బీడీలు చేసి మళ్లీ ఇల్లు నిర్మించుకోవాలని ఉండేది ఇందిరమ్మ ఇల్లు రావడము ఇంకా సంఘములో రూ.1,50,000/- లు రావడముతో అందులో నుండి రూ.50,000/-లు తీసుకుని యం.సి.పి ద్వారా ఇల్లు కట్టుకున్నాను. ఇంటి అప్పు తీర్చు సమయంలో నా భర్త ఒక మిల్లులో హమాలి పని చేసేవాడు తనకు డ్రైవింగ్ వచ్చింది అది అలోచించి నేను వి.వో నుండి రూ.45,000/-లు తీసుకుని యం.సి.పి ద్వారా అప్పు దొరికింది. నేను మా సంఘానికి ఆర్థిక పరిస్థితి మా సంఘ సభ్యులకు చెప్పాను వారు ఆలోచించి నన్ను తీసుకున్నారు దాంతో ఆటో కొనుక్కున్నాను దాని అప్పును కూడా సక్రమముగా తీర్చే సమయంలో నాకు మా గ్రామంలో సి.ఆర్.పిగా బీహారుకు వెళ్లాను అని తెల్సింది. దాంతో నేను నా భర్తను అనుసరించి సి.ఆర్.పి గా బీహార్ కి వెళ్లి నేను ఎంతో సంపాదించుకోగలుగుతున్నాను.

విజయం అంటే మీరు సాధించిన దాని గురించి మాత్రమే కాదు, మీరు ఇతరులను ఏమి చేయడానికి ప్రేరేపిస్తారు అనే దాని గురించి కూడా. ఈ ప్రయాణం దృఢ సంకల్పం మరియు సరైన మద్దతుతో ఏదైనా సాధ్యమని రుజుపు చేస్తుంది.

ఈ కథను భాగస్వామ్యం చేయండి

మరిన్ని కథలు

కథల గురించి

ఈ విజయ గాథలు అంకితభావం, నైపుణ్యాభివృద్ధి మరియు కమ్యూనిటీ మద్దతు ద్వారా తమ జీవితాలను మార్చుకున్న వ్యక్తుల విశేషమైన ప్రయాణాలను ప్రదర్శిస్తాయి. ప్రతి కథ సాధికారత యొక్క శక్తికి నిదర్శనం.

మీ కథను భాగస్వామ్యం చేయండి

ప్రేరణాత్మక ప్రయాణం ఉందా? మీ విజయ గాథను మాతో భాగస్వామ్యం చేయండి మరియు ఇతరులను ప్రేరేపించండి.

మమ్మల్ని సంప్రదించండి

OMS Assistant

Hello! I'm your OMS assistant. How can I help you today?
You can ask me about:
  • SHG Registration Process
  • Loan Schemes
  • Training Programs
  • District Office Contacts